TG News: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:20 PM
సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. వేరే వారి వీర్యకణాలతో వైద్యురాలు సంతానం కలిగించారు. దీంతో సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో (Srushti Test Tube Baby Center) పోలీసులు ఇవాళ (శనివారం జులై 24) తనిఖీలు నిర్వహించారు. పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారు వైద్యురాలు. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు దంపతులు. కడుపులో ఉన్న శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలడంతో పోలీసులను ఆశ్రయించారు దంపతులు. వారి ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే పుట్టిన బాబుకి కేన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కి గురయ్యారు. ఈ విషయం తెలియడంతో వెంటనే మరో డాక్టర్‌ను కలిశారు దంపతులు. డీఎన్‌ఏ టెస్ట్ చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొమ్మిదేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సీజ్ చేశారు. అక్రమంగా అనుమతులు పొంది.. మళ్లీ నిర్వహిస్తున్నారు డాక్టర్ నమ్రత. రెండు గంటలుగా రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా పెద్దఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపించి వీర్యం సేకరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే.. విజయవాడ నుంచి డాక్టర్ నమ్రత వస్తున్నారు. నమ్రతను విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
మా ఇంటికి ఫోన్ చేయండన్నా.. ప్రాణాలు పోయే ముందు బీటెక్ విద్యార్థిని వేడుకోలు..
Read latest Telangana News And Telugu News