Share News

Draupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..ఎప్పుడంటే..

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:11 AM

భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Draupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..ఎప్పుడంటే..
Draupadi Murmu

హైదరాబాద్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 21న మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30గంటలకు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 3:25 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు ద్రౌపది ముర్ము.


3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..

షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2025 | 11:18 AM