Share News

Rave Party: యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. చివరికి..

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:47 AM

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే ఇద్దరు మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా వీకెండ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జల్సారాయుళ్లను హైదరాబాద్ కొండాపూర్‌కి తీసుకువచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీ నిర్వహిస్తుంటారు.

Rave Party: యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. చివరికి..
Rave Party

హైదరాబాద్: కొండాపూర్‌లో భారీ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్‌లో రేవ్ పార్టీ చేసుకుంటున్న 9మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీఎత్తున డ్రగ్స్, మద్యం బాటిళ్లు, ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, ఈ వ్యవహారంలో మెుత్తం 11మందిపై కేసు నమోదు అయ్యింది. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే ఇద్దరు మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా వీకెండ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జల్సారాయుళ్లను హైదరాబాద్ కొండాపూర్‌కి తీసుకువచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీ నిర్వహిస్తుంటారు.


ఈ క్రమంలోనే శనివారం నాడు ఏపీకి చెందిన కొంతమంది వ్యక్తులను అలాగే యువతులను తీసుకువచ్చి రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సదరు అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ మందు, చిందు, డ్రగ్స్ లో మునిగిపోయారు. అయితే రేవ్ పార్టీ విషయమై శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై సంధ్య బాలరాజు, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో మెుత్తం 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 2.08 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. కాగా, ప్రధాన నిందితులను ఏపీకి చెందిన వాసు, శివం రాయుడుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుస్తున్నారని ఎస్సై సంధ్య బాలరాజు తెలిపారు.


డబ్బులుండి సరదాగా గడపాలని అనుకునే వారిని నిందితులు వారానికి రెండ్రోజులపాటు హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఎంజాయ్ చేయించి తీసుకెళ్తుంటారని పేర్కొన్నారు. పక్కా సమాచారం మేరకు వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్ అనే వ్యక్తి డ్రగ్స్ తెప్పించే వాడని వెల్లడించారు. పట్టుపడిన వారిలో ప్రవీణ్ కుమార్, అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్ శ్రీ దత్, నంద, సమతా తేజ ఉన్నట్లు తెలిపారు. వీరితోపాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంధ్యా బాలరాజు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న అనంతరం శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Mansa Devi Temple Stampede: హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

Brain Damaging Habits: ఇలాంటి అలవాట్లు కూడా బ్రెయిన్‎కు డేంజరని తెలుసా మీకు..

Updated Date - Jul 27 , 2025 | 11:52 AM