Share News

Prabhakar Rao Phones Seized: మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్.. ఫోన్ సీజ్

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:29 PM

Prabhakar Rao Phones Seized: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.

Prabhakar Rao Phones Seized: మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్.. ఫోన్ సీజ్
Prabhakar Rao Phones Seized

హైదరాబాద్, జులై 16: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును (Former SIB Chief Prabhakar Rao) మరోసారి విచారించారు సిట్ అధికారులు. ఈరోజు (బుధవారం) ఉదయం సిట్ అధికారుల ముందు ఏడోసారి విచారణకు హాజరయ్యారు ప్రభాకర్‌ రావు. ఈసారి విచారణలో పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభాకర్ రావు మూడు సెల్ ఫోన్స్‌ను వాడినట్లు గుర్తించారు. ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన వ్యక్తిగతమైన మొబైల్స్‌‌ను సిట్‌కు అందజేయాలని గతంలోనే సిట్ ఆదేశాలు ఇస్తూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఒక మొబైల్‌ను మాత్రమే సిట్‌ అధికారులకు ప్రభాకర్ రావు అందజేసినట్లు తెలుస్తోంది. సిట్‌కు ఇచ్చిన మొబైల్‌లో డేటా క్లియర్ చేసి ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. మరో రెండు మొబైల్స్ అమెరికాలో మర్చిపోయి వచ్చానని అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం.


2023, నవంబర్‌లో ఫోన్‌ ట్యాపింగ్ జరిగింది. దాదాపు 618 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ క్రమంలో 2023 ఎన్నికల సమయంలో వాడిన ఫోన్‌ను అప్పగించాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. అయితే కేవలం ఒక్క మొబైల్‌ను మాత్రమే సిట్ అధికారులకు ఇచ్చారు ప్రభాకర్. అందులోని డాటాను మొత్తం క్లియర్ చేసి ఇచ్చినట్లు సమాచారం. ఇక.. 2023 నవంబర్‌లో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. నిన్న, ఈరోజు జరిగిన విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చిట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ నేతలు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది.


ఇవి కూడా చదవండి..

మల్నాడు డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు

హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 01:37 PM