Share News

Minister Damodar: ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. మంత్రి దామోదర్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 10:10 PM

ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు ఐవీఎఫ్ సెంట‌ర్ల‌లో త‌నిఖీలు నిర్వ‌హించాలని ఆదేశించారు. ఆయా సెంట‌ర్ల‌పై ఇదివ‌ర‌కే న‌మోదైన కేసుల వివ‌రాలు సేక‌రించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.

Minister Damodar: ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. మంత్రి దామోదర్ కీలక ఆదేశాలు
Minister Damodar Rajanarsimha

హైదరాబాద్: మాతృత్వం కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, ఐవీఎఫ్‌, సరోగసీని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం అవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐవీఎఫ్ క్లినిక్‌లలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమించాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.


ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సభ్యులుగా కమిటీని నియమిస్తూ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క‌మిటీ నేతృత్వంలో ప్రైవేటు ఐవీఎఫ్ సెంట‌ర్ల‌లో త‌నిఖీలు నిర్వ‌హించాలని ఆదేశించారు. ఆయా సెంట‌ర్ల‌పై ఇదివ‌ర‌కే న‌మోదైన కేసుల వివ‌రాలు సేక‌రించాలని సూచించారు. ఆయా సెంట‌ర్ల అనుమ‌తులు, రిజిస్ట్రేష‌న్ల వ్యాలిడిటీ వంటి అంశాల‌ను ప‌రిశీలించాలని ఆదేశించారు. ఈ ప్ర‌క్రియ‌ను ప‌ది రోజుల్లో పూర్తి చేసి, నివేదిక అందించాల‌ని ఈ క‌మిటీని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 10:14 PM