KRMB : నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక సూచనలు
ABN , Publish Date - Feb 27 , 2025 | 06:58 PM
KRMB: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా నీటి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఈరోజు కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డు( KRMB) సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శ్రీశైలం నాగార్జునసాగర్లలో ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలు లేకుండా సామరస్య పూర్వకంగా పంచుకోవాలని బోర్డు దిశా నిర్దేశం చేసింది. మొదటగా తాగునీటి అవసరాలకు ప్రయారిటీ ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. పంటల సాగు కీలక దశలో ఉన్నందున.. అవసరానికి అనుగుణంగా వృథా కాకుండా నీటిని వాడుకోవాలని తెలిపింది.
ఎవరికి ఎంత నీటి అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సాగర్ నుంచి ఏపీ 7వేల క్యూసెక్కులు, తెలంగాణ 9వేల క్యూసెక్కుల వాటర్ డ్రా చేసుకుంటున్నట్లు పేర్కొంది. శ్రీశైలం నుంచి 2, 200 క్యూసెక్కుల నీటిని ఏపీ తీసుకుంటుంది. శ్రీశైలం నుంచి తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు డ్రా చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెండు ప్రాజెక్టులలో ఉన్న 70 టీఎంసీలను సమ్మర్ వరకు పొదుపుగా వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సూచనలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana MLC Elections: హోరాహోరీగా తెలంగాణలో ఎన్నిక.. కాంగ్రెస్, బీజేపీకి షాక్ తప్పదా
MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..
SLBC Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆశలు వదులుకుంటున్న అధికారులు..
Read Latest Telangana News and Telugu News