Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్..
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:47 PM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సుదీర్ఘ కాలం అజారుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌పై ఎలాంటి కేసులు ఉన్నాయి..? అవి ఏమయ్యాయో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి..? అని ప్రశ్నించారు. భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం కిషన్ రెడ్డి మరిచిపోయారా..? అని మండిపడ్డారు. ఎంపీగా కూడా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై బీజేపీ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అజారుద్దీన్ సుదీర్ఘ కాలం దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి పదవి గురించి మూడు నెలల ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్