Share News

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:46 AM

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త తెలిపింది. ఇంతకుమందు విద్యార్థులు సంబంధిత వెబ్‌సెట్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్స్‌ను నేరుగా విద్యార్థుల మొబైల్‌కే పంపిస్తున్నట్లు తెలిపింది.

 TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..
TG EAPCET Results

హైదరాబాద్: టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాలపై హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరం టీజీ ఈఏపీసెట్ ఫలితాలను అభ్యర్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు, విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయంలోని వెబ్‌సైట్‌లో చూసేవారు.


ఫలితాలు చూసే సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటం, సాంకేతిక లోపాలు తలెత్తేవి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ యూనివర్సిటీ ఇప్పటినుంచి ఎస్ఎంఎస్(SMS) రూపంలో ఫలితాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితాల మార్క్ లిస్ట్‌ను https://eapcet.tgche.ac.in లో అందుబాటులో ఉంచుతామని అవరసరమైన విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.


హాల్ టికెట్లు విడుదల

అలాగే వ్యవసాయ, వైద్య (AM) విభాగానికి సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ఇంజనీరింగ్ విభాగం హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఈ సంవత్సరం హాల్ టికెట్లు గూగుల్ మ్యాప్స్‌కి (Google Maps) లింక్ చేయబడిన QR కోడ్‌తో వస్తాయని అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించడానికి, నావిగేట్ చేయడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. QR కోడ్‌ స్కాన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చని అన్నారు.


టీజీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. వ్యవసాయం, వైద్య విభాగం పరీక్షలు ఏప్రిల్ 29, 30వ తేదీల్లో జరుగుతాయని జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 2,3,4 తేదీల్లో జరుగుతాయని అన్నారు. తుది పరీక్ష జరిగిన 10 రోజుల్లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు రూ. 5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 11:55 AM