Share News

Rains in Hyderabad: బిగ్ అప్‌డేట్.. నగర వ్యాప్తంగా భారీ వర్షం..

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:08 PM

మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో ...

Rains in Hyderabad: బిగ్ అప్‌డేట్.. నగర వ్యాప్తంగా భారీ వర్షం..
Hyderabad Rains

హైదరాబాద్, జులై 22: మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని నార్సింగి, గండిపేట్, మణికొండ, ఖాజాగూడ, షేక్‌పేట్, టోలీచౌకి, ఆరంఘర్, మైలారదేవిపల్లి, గోల్కొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్, బార్కాస్, శివరాంపల్లె, కాటేదాన్, చంద్రాయన పల్లె, కాటేదాన్, శంకరగుట్ట తదితర ప్రాంతాల్లో రెండు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.


రాత్రి సమయంలోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు సైబరాబాద్ పోలీసుల సైతం కీలక అడ్వైజరీ జారీ చేశారు. వాతావరణ సూచన దృష్ట్యా.. ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని పోలీసులు సూచించారు.

మరోవైపు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు. అంతేకాదు.. నగరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ప్రభుత్వం అలర్ట్..

భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏవైనా సమస్యలుంటే.. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.


Also Read:

తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. వైసీపీకి పవన్

దాడి చేస్తే భాష వచ్చేస్తుందా..

ఎన్ని ఇబ్బందులో: డిప్యూటీ సీఎం పవన్

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 22 , 2025 | 06:08 PM