Share News

Actress Kalpika Ganesh: సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు.. ఎందుకంటే..

ABN , Publish Date - Jun 14 , 2025 | 02:08 PM

సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.

Actress Kalpika Ganesh: సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు.. ఎందుకంటే..
Actress Kalpika Ganesh Case

హైదరాబాద్: సినీ నటి కల్పికా గణేష్‌పై (Actress Kalpika Ganesh) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 67 ఐటీఏ 2000-2008,79,356 BNS ప్రకారంగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.


ఆన్‌లైన్‌లో అభ్యంతరకరమైన రీతితో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడంతోపాటు తనకు మెసేజ్ లు పెట్టి దారుణంగా మాట్లాడిందని బాధితురాలు కీర్తన తెలిపారు. ఇన్‌బాక్స్ మెసేజ్‌లు స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారాలను ఆమె సమర్పించారు. ఈ మేరకు కల్పికపై రెండో కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి

మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు

పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 05:05 PM