V Hanumantha Rao: బీసీ బంద్‌లో కిందపడిపోయిన వి.హనుమంతరావు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:40 PM
బీసీ ర్యాలీలో ర్యాలీలో వి.హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా.. అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావును పైకి లేపారు.
హైదరాబాద్: అంబర్‌పేట్ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంఘాల నాయకులు బంద్ చేపట్టారు. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. వి.హనుమంతరావుతో సహా కాంగ్రెస్ నేతలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ.. ర్యాలీగా ముందుకు సాగారు.
ఈ నేపథ్యంలో ర్యాలీలో వి.హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా.. అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావును పైకి లేపారు. అనంతరం ర్యాలీ యథావిధిగా కొనసాగింది. వి.హనుమంతరావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం