HCA SRH Dispute: హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:38 PM
HCA SRH Dispute: నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు.

హైదరాబాద్, జులై 10: హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంలో (HCA SRH Dispute) ఐదుగురు అరెస్ట్ అయినట్లు సీఐడీ (CID) ప్రకటించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవితను సీఐడీ అరెస్ట్ చేసింది. హెచ్‌సీఏ నిధులను దుర్వినియోగం చేసినట్లు సీఐడీ గుర్తించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ.. నకిలీ పత్రాలతో జగన్ మోహన్ రావు అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు గుర్తించింది.
నకిలీ పత్రాలతోనే జగన్ మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేశారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కోసం నకిలీ పత్రాలను సృష్టించారని విచారణలో వెల్లడైంది. ఈ నకిలీ పత్రాల ద్వారా ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల జగన్ మోహన్ రావు హెచ్‌సీఏలో అధ్యక్షుడిగా పోటీ చేశారని సీఐడీ గుర్తించింది. జగన్ మోహన్ రావు , సీజే శ్రీనివాస్ రావు, ట్రెజరర్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కుట్రపూరితంగా ఎన్నిక అయినట్లు విచారణలో సీఐడీ బయటపెట్టింది. నేరపూరిత నమ్మక ద్రోహంతో, ప్రజా నిధులను జగన్ మోహన్ రావు దుర్వినియోగం చేశారని సీఐడీ తెలిపింది.
ఐపీఎల్, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు గుర్తించింది సీఐడీ. కాంప్లిమెంటరీ టిక్కెట్లపై జగన్ మోహన్ రావు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. కార్పొరేట్ బాక్సులకు ఉద్దేశపూర్వకంగా తాళాలు వేసి వేధింపులకు పాల్పడ్డారని.. తాము చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని సీఐడీ విచారణలో బయటపడింది. ఈకేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి.. జ్యుడిషయల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఢిల్లీకి సిట్ అధికారులు.. ఎందుకంటే
మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం
Read Latest Telangana News And Telugu News