Share News

MLA Kavvampally Vs Rasamayi: కామలీలల కవ్వంపల్లి.. రాసలీలల రసమయి.. సోషల్ మీడియాలో పోస్టర్లు కలకలం..

ABN , Publish Date - Jul 10 , 2025 | 10:45 AM

సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య పోస్టర్ల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్‌ ఇటు కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

MLA Kavvampally Vs Rasamayi: కామలీలల కవ్వంపల్లి.. రాసలీలల రసమయి.. సోషల్ మీడియాలో పోస్టర్లు కలకలం..
MLA Kavampalli Vs Rasamayi Balakishan

కరీంనగర్: మానకొండూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వార్ నడుస్తోంది. కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేయగా.. రాసలీలల రసమయి అంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీ నేతల పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


కాగా, గుండ్లపల్లి నుంచి పొత్తురు వరకూ డబుల్ రోడ్ విషయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వివాదం నడుస్తోంది. 'రోడ్డు ఇంకెప్పుడు పూర్తిచేస్తావ్?.. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కమీషన్ల నారాయణ' అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే వర్గం ప్రతి దాడికి దిగింది. ప్రతీకారంగా రాసలీలల రసమయి అంటూ కాంగ్రెస్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇలా ఈ రెండు పార్టీల నేతల మాటలు వివాదానికి తెరలేపాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వార్ నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 03:24 PM