Home » Karimnagar
ఓసీపీ-3 ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన రెండు మోటార్ గ్రేడర్లను గురువారం జీఎం బండి వెంకటయ్య ప్రారంభించారు. బేస్‌వర్క్‌షాప్‌లో రెండు యంత్రాలకు పూజలు చేసిన అనంతరం వినియోగంలోకి తెచ్చారు.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, దొంగతుర్తి, పైడిచింతలపల్లి, ఖానంపల్లి గ్రామాలలో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెం దుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం అందుగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మద్దతుగా గురు వారం ఉదయం ప్రచారం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ నాయకుడిగా చెప్పుకుంటున్న హరీష్‌రెడ్డి ముఖమే తమకు తెలియదని, అతడిని ఎన్నడూ చూడలేదని గోదావరిఖని గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం నాయకులు మేరుగు గట్టయ్య, మొగిలి కడి యాల జంపయ్య, మేరుగు రాజేష్‌లు పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళా శాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కోడూరి రమేష్ మాట్లాడారు. విద్యార్థులు, యువత మానవ హక్కులు, చట్టాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీబీ ఛాంపియన్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారం భించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో టీబీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలం తర్వాత గ్రామ పంచాయతీ పోలింగ్ గురువారం జరగనుంది. తొలి విడత జిల్లాలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మంథని మండలంలోని 3, రామగిరి మండలంలో ఒక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామగుండం కార్పొరేషన్‌లో ప్రజ లకు మౌలిక వసతులు పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వార్డు అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయా లని నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. మంగళ వారం ఆమె జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్ చేశారు.