Hyderabad: నగరంలో.. 90శాతం కల్తీ కల్లే విక్రయం..
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:38 AM
రాష్ట్రంలో ఒకప్పుడు ఈత, తాటి చెట్లు విపరీతంగా ఉండేవి. 50 ఏళ్ల నుంచి వ్యవసాయం, రహదారుల విస్తరణ, పట్టణాల పెరుగుదలతో చాలాచోట్ల చెట్లను కొట్టేశారు.

- ఈతచెట్లు లేనిచోట దుకాణాలు
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో ఒకప్పుడు ఈత, తాటి చెట్లు విపరీతంగా ఉండేవి. 50 ఏళ్ల నుంచి వ్యవసాయం, రహదారుల విస్తరణ, పట్టణాల పెరుగుదలతో చాలాచోట్ల చెట్లను కొట్టేశారు. గతంలో హైదరాబాద్(Hyderabad) నగర పరిసరాలలో విరివిగా కనిపించే ఈత, తాటి చెట్లు ఉండగా, ప్రస్తుతం నగరానికి 50 కిలోమీటర్ల లోపు అవి కనిపించడకుం డా పోయాయి. పట్టణాలకు 50 కి.మీ. లోపు తగినన్ని ఈత, తాటి చెట్లు లేకపోతే కల్లు దుకాణాలను మూసివేయాలి.
మొదటి నుంచీ కల్లుకు గిరాకీ ఉండడంతో సహజ సిద్ధంగా చెట్ల నుంచి తీసే కల్లు స్థానంలో మత్తు రావడానికి ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపామ్, అల్ర్పాజోలమ్ వంటివి కలిపి కల్లును విక్రయిస్తుండడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడింది. అం దుకు తాజా సంఘటనే నిదర్శం. కూకట్‌పల్లి చుట్టుపక్కల ఉన్న కల్లు దుకాణాల్లో రెండు మూడు రోజుల కిత్రం కల్లు తాగిన వారిలో నలుగురు మృతి చెందగా.. 31 మందికి పైగా అస్వస్థతతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
కల్తీ కల్లు విక్రయంలో ఎక్సైజ్ శాఖ తీసుకున్న చర్యలు శూన్యమని పలువురు సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. మందు కల్లుతో అనారోగ్య సమస్యలు రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరంలో ఆ కల్లును తయారుచేసి విక్రయించే దుకాణాలను మూసివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గీత కార్మికులకు ఉపాధి పేరుతో నగరంలో ఆయా దుకాణాలను ప్రభుత్వం తెరిపించడంతో విక్రయాలు చేపట్టారు. ఎలాంటి కల్లును విక్రయించాలన్న దానిపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో 90 శాతం మందులతో తయారు చేసిన కల్లునే విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నిబంధనలు బేఖాతరు
నగరంలో నిర్వహిస్తున్న కల్లు దుకాణాల సొసైటీలు ఈత చెట్ల నుంచి తీసిన కల్లునే విక్రయించాలన్న నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మందులతో తయారు చేసిన కల్లును కాంపౌండ్‌లలో విక్రయిస్తుండడం తో ఆ కల్లు తాగిన వారు అస్వస్థతకు గురువుతున్నారు. ఈ విషయం ఎక్సైజ్ శాఖకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈత చెట్లు లేని చోట వందలాది సంఖ్యలో కల్లు దుకాణాలకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిషా కోసమే..
నగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చిన వారిలో మెజారిటీ ప్రజలు నిషా కోసం కల్లు తాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరంలో విక్రయించే కల్లులో మత్తు తీవ్రత ఎక్కువగా ఉండడంతో కల్లు తాగే వారితో దుకాణాలు రద్దీగా ఉంటున్నాయి. కూకట్‌పల్లి, మూసాపేట లాంటి ప్రాంతంలో ఉన్న కల్లు దుకాణాలకు రోజూ 150-200 మంది కల్లు తాగేందుకు వస్తున్నట్లు అక్కడి దుకాణాల నిర్వహకులు పేర్కొంటున్నారు. నగరంలో ఉన్న కల్లు దుకాణాలన్నీ పేద, మధ్య తరగతి, కూలీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే
Read Latest Telangana News and National News