Share News

MLA Harish Rao: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సత్తా చాటుదాం..

ABN , Publish Date - Jul 10 , 2025 | 10:14 AM

జూబ్లీహిల్స్‌(Jublihills) ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) పిలుపునిచ్చారు.

MLA Harish Rao: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సత్తా చాటుదాం..

- హరీశ్‌రావు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌(Jublihills) ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌(BRS) హైదరాబాద్‌ మైనార్టీ విభాగం సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమది సెక్యులర్‌ ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్‌.. 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీనేతను మంత్రిగా చేయలేదన్నారు.


city6.2.gif

హైడ్రా, మూసీ పేర్లతో రేవంత్‌ సర్కార్‌ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గూడులేకుండా చేసిందన్నారు. మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు బుద్ధిచెప్పాలని మహమూద్‌అలీ, తలసాని, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మైనార్టీలను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 10:14 AM