Share News

Ande sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ABN , Publish Date - Nov 10 , 2025 | 08:18 AM

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన అస్వస్థతకు గురవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.

Ande sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
Ande sri

హైదరాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): 'జయ జయహే తెలంగాణ' అంటూ తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. 'జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి' అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు ఈరోజు ఊపిరిని వదిలేసింది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.


అందెశ్రీ ప్రస్థానం ..

  • 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు.

  • అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.

  • అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

  • జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు.

  • తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

  • ఇటీవల రూ.కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది.

  • కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

  • అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.

  • 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం పొందారు.

  • 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు.

  • 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు.

  • 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు.

  • 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం సాధించారు.

  • 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు.

  • లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2025 | 11:34 AM