Share News

Elephant Tusk Smuggling: ఏనుగు దంతాల స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:26 PM

Elephant Tusk Smuggling: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నమని.. ఇవి ఒరిజినల్ దంతాలా కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించినట్లు చెప్పారు.

Elephant Tusk Smuggling: ఏనుగు దంతాల స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
Elephant Tusk Smuggling

హైదరాబాద్, జూన్ 25: ఏనుగు దంతాలను స్మగ్లింగ్ (Elephant Tusk Smuggling) చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చెందిన నిందితుడు రేకులకుంట ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ వద్ద నుంచి 5.6 కిలోల రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దంతాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్‌వోటీ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి శేషాచలం పారెస్టు నుంచి ఏనుగు దంతాలను నిందితుడు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో కూడా ప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రసాద్‌ను అప్పట్లోనే రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.


ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నామన్నారు. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నమని.. ఇవి ఒరిజినల్ దంతాలా కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించినట్లు చెప్పారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం ఇది చట్టరీత్యా నేరమని.. ఏనుగు నుంచి ఇవి కట్ చేసి సేకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రసాద్, లోకేశ్వర్ రెడ్డి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శేషాచలం అడవుల్లోని ఏనుగుల నుంచి ఇవి సేకరించారన్నారు సీపీ. రాచకొండ పోలీసులు ఇల్లీగల్ యాక్టివిటిపై దృష్టి సరించామని, బస్సుల్లో తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారని... బస్సులో ఒక పెట్టలో పెట్టి తీసుకొచ్చారని.. అనుమానించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.


ఏనుగు దంతాల స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడ్డ ఏనుగు దంతాలు 5.62 కేజీలు ఉంటుందని తెలిపారు. నిందితులు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని.. దాదాపు రూ.3 కోట్లు విలువ గల ఏనుగు దంతాలను సీజ్ చేశామన్నారు. 50 నుంచి 60 లక్షల వరకు కేజీ ఏనుగు దంతాలు మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. నిందితుడు ప్రసాద్ మాత్రమే పట్టుబడ్డాడని.. మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రసాద్, లోకేశ్వర్ ఇద్దరూ గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారని.. ఇద్దరికీ జైలులో పరిచయం ఏర్పడిందని.. జైలు నుంచి విడుదల అయ్యాక ఏనుగు దంతాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో

యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 04:31 PM