Women Suicide: ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:57 AM
Women Suicide: ఈనెల 22న సాయంత్రం ఆరు గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు యువతి తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే రాత్రి గడిచినప్పటికీ అనూష ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్, జూన్ 25: నగరంలోని రాయదుర్గంలో (Rayadurgam) ఓ యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఓయో హోటల్లో యువతి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు అనూష (26)గా గుర్తించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నల్లగండ్లలో నివాసం ఉంటున్న అనూష బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. అనూషకు పెళ్లి జరిగినప్పటికీ భర్తతో విభేదాలు తలెత్తాయి.
దీంతో భర్త నుంచి విడిపోయిన యువతి.. తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. వారిని చూసుకుంటూ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 22న సాయంత్రం ఆరు గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు యువతి తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే రాత్రి గడిచినప్పటికీ అనూష ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో యువతి కోసం గాలించడం మొదలుపెట్టారు. బంధువులను ఫోన్ చేసి అనూష గురించి ఆరా తీశారు. అయితే ఎవరూ రాలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అనూష. ఈ విషయాన్ని ఓయో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా... వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అనూష ఎందుకు సూసైడ్ చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. యువతి మృతి విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. కానీ యువతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అసలు యువతి లాడ్జ్‌కు ఎందుకు వచ్చింది.. యువతితో పాటు ఎవరైనా వచ్చారా.. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి.. యువతిది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా స్నేహితులను కలుస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Read latest Telangana News And Telugu News