Share News

Congress Vs BRS: మాగంటిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఉద్రిక్తత

ABN , Publish Date - Jan 21 , 2025 | 01:47 PM

Telangana: జూబ్లీహిల్స్‌లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, సిటీ ఇన్‌చార్జ్ మినిస్టర్ ఫోటోలను లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రెహమత్‌నగర్‌లో ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.

Congress Vs BRS: మాగంటిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఉద్రిక్తత
Protocal war BRS Vs Congress

హైదరాబాద్, జనవరి 21: నగరంలోని జూబ్లీహిల్స్‌లో మరోసారి ప్రోటోకాల్ వార్ నెలకొంది. రెహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను (BRS MLA Maganti Gopinath) కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రుల ఫోటోలతో ఫ్లెక్సీలు లేకుండా ఎమ్మెల్యే మాగంటి తీసివేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


జూబ్లీహిల్స్‌లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, సిటీ ఇన్‌చార్జ్ మినిస్టర్ ఫోటోలను లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రెహమత్‌నగర్‌లో ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇంకా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని స్థానిక కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గోపీనాథ్ ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గత మూడు నెలలుగా షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్‌లు వచ్చినప్పటికీ సంతకాలు చేయడం లేదని విమర్శించారు.

ట్రంప్‌ టేబుల్‌పైకి తిరిగి వచ్చేసిన స్పెషల్ బటన్..


బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే చెక్‌లపై సంతకాలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తప్పకుండా ఉండాలన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఫోటోలు లేకుండా ప్రైవేటు కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో 500లకు పైగా చెక్‌లు ఉన్నాయని.. వాటిని పంపిణీ చేయకుండా.. కావాలనే కాలయాపన చేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి..

చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో..

బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహావేశం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2025 | 01:47 PM