CM Revanth: ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:55 PM
ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం పాల్గొననున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రజాపాలనలో భాగంగా నిత్యం అధికారులతో సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫుడ్ బాల్ ప్రాక్టీస్ చేశారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లో ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీ పాల్గొననున్నారు. మెస్సీతో కలిసి సీఎం ఫుట్‌బాల్ ఆడనున్నారు. దీనిలో భాగంగా ఎంసీహెచ్ఆర్‌డీలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న మెస్సీకి ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక గోట్ ఇండియా టూర్ 2025లో డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీతో కలిసి సీఎం రేవంత్ పోటీ పడనున్నారు. మెస్సీ టీంతో తలపడే జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్‌కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్లు రేవంత్ టీంలో ఆడనున్నట్లు సమాచారం. ఆర్‌ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఫుట్‌బాల్ అంటే సీఎంకు ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఈ ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ రైతుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: హరీష్ రావు
ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
Read Latest Telangana News And Telugu News