Harish Rao Father Death: హరీష్ రావు తండ్రికి రేవంత్, కేసీఆర్ సంతాపం..
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:32 AM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థింస్తున్నట్లు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో వారి నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కవిత ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!