Trains: చర్లపల్లి టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:44 AM
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ సిటీ: చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, నర్సపూర్(Kakinada, Narsapur) ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న వేసవి ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఆయా మార్గాల్లో మొత్తం 36 రైళ్లను జూన్ 29వరకు పొడిగిస్తున్నామని సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు. చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (07031/ 07032) ప్రత్యేక రైళ్లు 18, చర్లపల్లి-కాకినాడ మధ్య (07233/07234) ప్రత్యేకరైళ్లు 18 నడుస్తాయని పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నా కోరిక తీర్చు... లేదంటే కుటుంబంపై యాసిడ్ పోస్తా
మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ(Guntur, Vijayawada), ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు తదితరల స్టేషన్లలో ప్రత్యేక రైళ్లు ఆగుతాయని సీపీఆర్‌ఓ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News