Share News

Jishnu Dev Varma: రైతు రుణమాఫీ తిరుగులేని సాయం

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:03 AM

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణను సమ్మిళిత అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు.

Jishnu Dev Varma: రైతు రుణమాఫీ తిరుగులేని సాయం

  • ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణను సమ్మిళిత అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో.. ప్రతి పౌ రుడి ఆకాంక్షను సాకారం చేసే, సమ్మిళిత పాలనను అందించే ప్రభుత్వం ఏర్పాటైందని అన్నా రు. గణతంత్ర దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రె డ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. ఎక్కడైతే మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడైతే తల ఎత్తుకుని ఉండగలమో, ఎక్కడైతే జ్ఞానాన్ని సముపార్జించగలమో, ఎక్కడైతే ప్రపంచం భాగాలుగా విడిపోదో.. అని గీతాంజలిలో ఠాగూర్‌ చెప్పిన విధంగా సమైక్య, సమ్మిళిత, ప్రగతిశీల దృక్పథాన్ని మనం స్ఫూర్తి గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


అదే సమయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సంక్షేమం, సమానత్వ విలువలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముకగా నిలుస్తోందని, గత ఏడాది వర్షాకాలంలో దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిందని, ఇది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన తిరుగులేని సాయమని తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుందని, దీని కింద ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందించనుందని వివరించారు.


మహిళా సాధికారతలో భాగం గా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటి వరకు మహిళలు రూ.4,501కోట్లను ఆదా చేసుకున్నారని వెల్లడించారు. గృహజ్యోతిలో భాగంగా 50లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. యువత సాధికారతే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. క్రీడలకు తెలంగాణ ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నాలుగున్నర లక్షల ఇళ్ల ను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దావోస్‌ సదస్సులో రూ.1,78,950 కోట్ల మేర ఒప్పందాలు జరిగాయ ని, తద్వారా ఐటీ, పునరుత్పాదక ఇంధన, ఔషధాల రంగాల్లో కొత్త పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో కనెక్టివిటీ, మొబిలిటీ పెరుగుతుందని, ఇది ఆర్థిక, సామాజిక ఏకీకరణకు మద్దతు ఇస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:03 AM