MLA Sri Ganesh: ఆ వ్యక్తిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన ఆరోపణలు..!
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:08 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తనపై దాడి చేయించింది అతడే అంటూ తన పార్టీలోని ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలను ఏబీఎన్‌తో వెల్లడించారు.

సికింద్రాబాద్, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తనపై జరిగిన దాడికి సూత్రధారులు అతడే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ' నా పార్టీలోనే ప్రత్యర్థులున్నారు. ఒక్క వ్యక్తితో తప్ప పార్టీలో ఎవరితో నాకు ఇబ్బందుల్లేవు. నా నియోజకవర్గానికి చెందిన ఆ వ్యక్తే (గొల్లకిట్టు) నాపై ఈ దాడి చేయించాడని అనుమానంగా ఉంది. కచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. డ్రైవర్ పైకి రాకుండా డైరెక్ట్ నన్ను టార్గెట్ చేస్తూ దాడి చేశారు. నాపై దాడి చేసిందంతా బయట నియోజకవర్గానికి చెందినవాళ్లే. ఈ దాడి గురించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయమని పోలీస్ అధికారులు సూచించారు'.
'నాపై దాడి చేస్తానని.. నన్ను అంతం చేస్తానని కొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. పార్టీలో తాను ఒక్కడినే ఉండాలి. తాను చెప్పినట్టే వినాలని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీలో వాళ్ళని, వీళ్లని ఎంకరేజ్ చేయొద్దని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చే వాళ్లతోనే ఇబ్బందిగా ఉంది. పార్టీలో తాను తప్పా ఎవరు ఉండొద్దని గుండాయిజం చెయ్యడం సమంజసం కాదు. రెండు మూడు రోజుల్లో బహిరంగంగా అన్ని విషయాలు బయట పెడుతాను' అని అన్నారు.
ఆదివారం బోనాల సందర్భంగా మాణికేశ్వర్ నగర్ లోని ఫలహారబండి కార్యక్రమానికి వెళ్తుండగా.. మార్గమార్గంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును ముట్టడించారు. ఒకేసారి సుమారు 20 మందికిపైగా వ్యక్తులు కారు ఆపి దాడికి యత్నించారు. అయితే గన్‌మెన్‌ల సమయస్పూర్తితో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడగలిగారు. నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News