Stealing Food in Train: రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:56 AM
రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడు చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంతటి నీచానికి దిగజారిన సదరు యువకుడిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో కొందరు యువత పెడదారి పడుతున్నారు. కనీసం మానవత్వం లేకుండా అవతలి వారి ఇబ్బందులను చూసి నవ్వుకుంటున్నారు. ఇదంతా జోక్ అని అనుకునే స్థితికి దిగజారుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ జనాలకు రోత పుట్టిస్తోంది. రెక్కల కష్టంతో బతికే చిరు వ్యాపారి పొట్టకొట్టిన ఓ యువకుడిపై జనాలు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లకు పశ్చాత్తాపం ఎందుకు ఉండదో అంటూ నిట్టూరుస్తున్నారు.
రద్దీ ఎక్కువగా ఉన్న రైల్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు పైబెర్తుపై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో చిరు వ్యాపారి ఒకరు తన నెత్తిన ఓ బస్తా పెట్టుకుని రకరకాల బిస్కెట్స్, చిప్స్ వంటివి విక్రయిస్తున్నాడు. అతడితో యువకుడు మాట కలిపాడు. ఒక్క వస్తువైనా కొనకుండానే అతడి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు రద్దీ కారణంగా ఆ వ్యాపారి నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో పైబెర్తు పై ఉన్న యువకుడు మెల్లగా వ్యాపారికి అనుమానం రాకుండా అతడి నెత్తిన ఉన్న బ్యాగ్‌లోంచి ఓ జ్యూస్ ప్యాకెట్ చోరీ చేశాడు. ఈ విషయాన్ని వ్యాపారి గ్రహించక ముందుకెళ్లిపోయాడు. యువకుడి స్నేహితుడు ఇదంతా వీడియోలో రికార్డు చేశాడు. అయితే, పైబెర్తు యువకుడు మాత్రం తానేదో ఘన కార్యం చేసినట్టు జ్యూస్ ప్యాకెట్ చూసుకుని తెగ మురిసిపోయాడు. అలా తన బెర్తు పక్క నుంచి వెళ్లిన ప్రతి వ్యాపారి వద్దా ఆ యువకుడు చోరీ చేశాడు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు మండిపడుతున్నారు. అతడిపై విరుచుకుపడ్డారు. పేదల కష్టాన్ని దోచుకుంటున్నందుకు ఆ యువకుడికి సిగ్గు ఎందుకు లేదని కొందరు ప్రశ్నించారు. కొందరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులను ట్యాగ్ చేసి నిందితుడని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా కామెడీగా భావించిన అతడికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:
క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు
లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్