BLIA: పేద విద్యార్థులకు బౌద్ధుల సాయం.. బూట్లు, క్రీడాసామగ్రి పంపిణీ..
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:31 AM
ప్రముఖ బౌద్ధ సంస్థ బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్ నగరం కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పేద పిల్లలకు బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసింది.

హైదరాబాద్: సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. హైదరాబాద్ నగరం కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే 1 నుండి 5 తరగతుల పిల్లలకు 271 జతల బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. పావన అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇండోర్ ఆట వస్తువులను బీఎల్ఐఏ హైదరాబాద్ సభ్యులు విరాళంగా ఇచ్చారు. బూట్లను సింగపూర్ చాప్టర్‌కు చెందిన మేడమ్ మోరిన్ అందించారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా భాగస్వామ్య విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని.. బీఎల్ఐఏ బాధ్యులు అభిప్రాయపడ్డారు. మాస్టర్ సింగ్ యున్ మార్గదర్శకత్వంలో స్థాపించబడిన బీఎల్ఐఏ.. మానవతా బౌద్ధమతాన్ని ప్రతిబింభిస్తుంది. కరుణ, సేవ, విద్య ద్వారా పేద పిల్లల జీవితంలో ఆధ్యాత్మిక అభ్యాసాన్ని అనుసంధానిస్తుంది.
సంఘరఖ్ఖిత మహాథెరో నాయకత్వంలో, బీఎల్ఐఏ దక్షిణాసియా సలహాదారు చుహ్మెన్ నిరంతర సేవ చేస్తోంది. గతంలో మహబూబ్ నగర్, ఖమ్మం, షాద్ నగర్, హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా.. బౌద్ధ తత్వశాస్త్రంలో బోధించిన దశ పరమిత (పది పరిపూర్ణతలు) - ముఖ్యంగా దాన పరమిత (ఉదారత్వం పరిపూర్ణత) - సజీవ ఉదాహరణ. పాదరక్షలు, వినోద వనరులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారా బీఎల్ఐఏ హైదరాబాద్ పేద పిల్లలకు ఆనందం, ఆశ, గౌరవాన్ని తీసుకురావాలనే లక్ష్యాన్ని కొనసాగిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
వారికి రేషన్ కార్డులు రద్దు!
మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి