Share News

Best FD Interest Rates: రెండేళ్ల కాలానికి FDలపై బెస్ట్ వడ్డీ రేట్లు అందించే టాప్ 7 బ్యాంకులు

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:43 AM

డబ్బును సురక్షితంగా భద్రపరుచుకుని, స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తక్కువ రిస్క్‌తో, స్థిరమైన లాభాలను పొందాలంటే మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs) మంచి ఆప్షన్. అలాంటి వారు రెండేళ్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఏ బ్యాంకులో వడ్డీ వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Best FD Interest Rates: రెండేళ్ల కాలానికి FDలపై బెస్ట్ వడ్డీ రేట్లు అందించే టాప్ 7 బ్యాంకులు
Best FD Interest Rates 2025

మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి, మంచి రాబడి పొందాలని చూస్తున్నారా? దీనికి, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs) మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి తక్కువ రిస్క్‌తో, గ్యారెంటీ రిటర్న్స్ ను అందిస్తాయి. సాధారణంగా మనం పెద్ద పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంకుల గురించే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) కూడా అద్భుతమైన వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి (Best FD Interest Rates 2025). ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తాయి. అంటే మీ పొదుపు సురక్షితంగా ఉండటంతోపాటు మంచి రాబడి కూడా వస్తుంది.


అత్యధిక వడ్డీ రేట్లు

ఈ రోజు మనం రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, రెండేళ్లలో ఎంత వస్తుందో చూద్దాం. ఈ డేటా జూలై 25 నాటి BankBazaar సమాచారం ఆధారంగా ఉంది. (ఈ రేట్లు సాధారణ పౌరుల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం కాదు. కోటి రూపాయల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి)

1. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఇది అన్ని SFBలలో అత్యధిక వడ్డీ రేటు ఇస్తోంది – ఏకంగా 8.15%

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • రెండేళ్ల తర్వాత: 1.16 లక్షలు

  • ఈ బ్యాంక్‌లో మీ డబ్బు సురక్షితంగా ఫాస్ట్‌గా పెరుగుతుంది


2. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఈ బ్యాంక్ 7.75% వడ్డీ రేటును అందిస్తోంది.

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • రెండేళ్ల తర్వాత: 1.16 లక్షలు

  • మంచి రాబడి కోసం ఇది కూడా సూపర్ ఆప్షన్

3. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఇక్కడ మీకు 7.65% వడ్డీ రేటు లభిస్తుంది

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • 2 ఏళ్ల తర్వాత: 1.15 లక్షలు


4. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఈ బ్యాంక్ కూడా 7.60% వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ ఇస్తోంది

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • 2 ఏళ్ల తర్వాత: 1.15 లక్షలు

  • సేఫ్ అండ్ స్టెడీ గ్రోత్ కోసం ఇది మంచి ఛాయిస్

5. ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఇది కూడా 7.60% వడ్డీ రేటును ఇస్తోంది

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • 2 ఏళ్ల తర్వాత: 1.15 లక్షలు

  • మీ పొదుపును పెంచడానికి ఇది మరో మంచి ఆప్షన్


6. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఈ బ్యాంక్ కూడా 7.60% వడ్డీ రేటుతో ఆకర్షిస్తోంది.

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • 2 ఏళ్ల తర్వాత: 1.15 లక్షలు

  • సురక్షితమైన రాబడి కోసం ఇది మంచి ఎంపిక

7. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

  • ఈ బ్యాంక్ 7.10% వడ్డీ రేటు ఇస్తోంది.

  • పెట్టుబడి: 1 లక్ష రూపాయలు

  • 2 ఏళ్ల తర్వాత: 1.14 లక్షలు


వివిధ బ్యాంకుల్లో..

మీ డబ్బును FDలో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఆయా బ్యాంక్ RBI ఆధ్వర్యంలో పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒక బ్యాంకులో 5 లక్షల రూపాయల వరకు మాత్రమే సురక్షితం. వడ్డీపై టాక్స్ కట్టాల్సి ఉంటుంది, కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోవాలి. FD బ్రేక్ చేస్తే జరిమానా ఉంటుంది. కాబట్టి రూల్స్ ముందే చెక్ చేసుకోవడం మంచిది. మీ డబ్బును వివిధ బ్యాంకుల్లో విభజించి పెట్టుబడి చేస్తే, రిస్క్ తగ్గి, రాబడి ఎక్కువగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 10:47 AM