Home » Investments
ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.
పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.
ఇటీవల అప్పు చేసి మరీ పసిడిపై పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి భారీ స్థాయిలో నష్టపోయిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణ ఇదని పోస్టు పెట్టిన వ్యక్తి కామెంట్ చేశారు.
SBI మ్యూచువల్ ఫండ్ భారత్‌లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్‌తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.
సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో సచిన్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..
పొదుపు ప్రతీ ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన రూల్ పోషిస్తుంది. నిత్యజీవితంలో పొదుపు చేస్తూ, ఆమేరకు పెట్టుబడుల్లో పెట్టగలిగితే, దీర్ఘకాలంలో ఒడిదుడుకులు లేని.
రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలతో పాటు రెండు స్టార్ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.