AP CM UAE Tour: యూఏఈ పర్యటనలో ఏపీ సీఎం.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:54 PM
యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
అమరావతి: యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) తొలి రోజున ఉత్సాహంగా పారిశ్రామికవేత్తలతో భేటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఇందుకు పలు కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని, గతాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. విశాఖలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ముఖాముఖీ భేటీల్లో గూగుల్ పెట్టుబడులపైనా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటన, పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి (Chandrababu UAE Tour).
ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌ను చంద్రబాబు కోరారు. ఇందుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలనే ఆలోచనతో ఉన్నామని సీఎం ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని చంద్రబాబు తెలిపారు. రైల్వేస్టేషన్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల మధ్య కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు చెప్పారు.
ఏపీలోని వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఆసక్తి ప్రదర్శించింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇక రాష్ట్రంలో వైద్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ విధానాన్ని అవలంబిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే హెల్త్ కార్డుల డిజిటలీకరణను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామని వివరించారు. బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థకు వైద్య రంగ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తోంది. ఇక దుబాయ్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం బ్రేక్ లేకుండా వరుసగా మీటింగ్‌లకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
Read Latest AP News And Telugu News