Minister Anagani Satya Prasad: సీఐఐ సమ్మిట్-2025 చరిత్ర సృష్టించింది: మంత్రి అనగాని..
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:55 PM
ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చిన చారిత్రాత్మక వేదిక విశాఖ సీఐఐ సమ్మిట్-2025 (CII Summit 2025) అని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) చెప్పారు. ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కష్టపడిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, సమ్మిట్ విజయవంతం కావడంపై తాజాగా మంత్రి అనగాని స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. 'ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రమిస్తున్నారు. పెట్టుబడులను ఏపీకి తేవడంలో చంద్రబాబు మరోసారి తన సత్తా చాటారు. మూడు ప్రాంతాలకూ సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అనుసరిస్తుండడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి.
మొత్తం రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రావడం ఏపీపై పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం. అన్ని కీలక శాఖలతో ఒప్పందాలు కుదరడమనేది పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపింది. మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వెళ్లడం.. ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం. సీఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది. ప్రతి జిల్లాకూ పరిశ్రమలను తీసుకొచ్చారు. విశాఖలో సదస్సు జరిగినా పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి చేశారు' అని కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Father Attack on Children: దారుణం.. వికలాంగులని పిల్లలను చంపేసిన తండ్రి..
Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..