MLA: రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:22 AM
రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కతుర్తిలో నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అన్నారు. సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

- సభ సక్సెస్ ఓర్వలేకనే కాంగ్రెస్ మంత్రుల విమర్శలు
- కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: దేశంలోనే ఎక్కడా లేని విధంగా రజతోత్సవ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. బీఆర్‌ఎస్ రజత్సోవ సభ విజయవంతం కావడాన్ని ఓర్వలేకనే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మంత్రులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ సభ సక్సెస్ పై మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు వినేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన ఎన్నో వాహనాలను సభకు రాకుండా పథకం ప్రకారం కాంగ్రెస్ పాలకులు అడ్డుకున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలైన తులం బంగారం, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ప్రజలకు అందించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో యువకుల ప్రతిభ
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో శంషీగూడాకు చెందిన ముగ్గురు యువకులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును మంగళవారం కలిశారు. వారిని అభినందించిన ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మాధవరం రంగారావు, స్నేహ విద్యాసంస్థల, స్నేహ జిమ్ చైర్మన్ రాజు, వెయిట్‌లిఫ్టర్లు రవికుమార్, అఖిల్, రాజు పాల్గొన్నారు.
వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News