Jubilee Hills by election: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి కుటుంబానికే..
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:44 AM
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills) బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ చిత్రపటానికి వజ్రనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తన సోదరుడి మరణం తరువాత కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారని, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పేందుకే సంస్మరణ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాగంటి గోపీనాథ్ లేని లోటు ఎవరూ పూడ్చలేనదని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఉపఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. అభ్యర్థి ఎంపికలో కేసీఆర్, కేటీఆర్(KCR, KTR) తుది నిర్ణయం తీసుకుంటారని, వారు ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం పని చేస్తానని అన్నారు. కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయాలని వజ్రనాథ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News