BJP: హెచ్‌ఎండీఏ ‘మాస్టర్ ప్లాన్’ మార్చాలి.. లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:20 PM
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సోమవారం గండిమైసమ్మ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. 11 సంవత్సరాలుగా జోన్ మార్పులకు నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం
ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి(Hyderabad, Rangareddy, Medchal, Sangareddy, Medak, Siddipet, Bhuvanagiri) జిల్లాల్లోని 70 మండలాలు, 24 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, దాదాపు 7 వందల గ్రామాలున్నాయన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రైతు ల పాలిట శాపంగా మారిందన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భూములను పలురకాలైన జోన్లుగా విభజించారన్నారు. దీని కారణంగా రైతులు తమ భూముల్లో సొంత ఇళ్లు కూడా నిర్మించుకునే పరిస్ధితి లేకుండా పోయిందన్నారు.
ఈ గ్రోత్ కారిడార్‌లో భూమి ఉన్నా కుటుంబం గడవని దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులకు తమ భూమి తమకు ఉపయోగపడే విధంగా మార్పులు చేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ ప్లాన్ తక్షణమే మార్చాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శిం దుండిగల్ విఘ్నే శ్వర్, మండల మాజీ అధ్యక్షుడు గోనే మల్లారెడ్డిలు ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్ పాలన ఐఫోన్‌లా.. రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉంది
ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News