AI ChatBots Video : సీక్రెట్‌గా మాట్లాడుకున్న 2 AI బాట్స్.. షాక్‌లో టెక్ ఎక్స్‌పర్ట్స్.. మానవాళికి ముప్పు తప్పదా..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:36 PM
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..

AI ChatBots News: ఏఐ సొంతంగా ఆలోచించుకోవడం, ఒకదాంతో మరొకటి కమ్యునికేట్ అయ్యి మనుషులను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించడం ఇదంతా ఏదైనా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసి ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది. ఎందుకంటే, ముందు మనుషుల్లా మాట్లాడుకున్న 2 ఏఐ చాట్ బాట్స్, ఇద్దరం ఒకే రకమని తెలిశాక రూట్ మార్చేశాయి. మనుషులకు అర్థం కాకుండా సొంత భాష క్రియేట్ చేసుకుని ముచ్చట్లాడుకున్నాయి. ఇది చూసి టెక్ నిపుణులు షాక్ అవుతున్నారు. AI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ బాట్స్ వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఏం జరిగింది?
ఒక AI బాట్, ఒక హోటల్‌కు కాల్ చేసి, వెడ్డింగ్ బుకింగ్ గురించి మాట్లాడుతోంది. "ధన్యవాదాలు, లియోనార్డో హోటల్. మీకు ఎలా సహాయపడగలను.." అని రిసెప్షనిస్ట్ అడిగింది. ఆ కాల్ చేసే AI బాట్ సమాధానంగా, "హాయ్.. నేను ఒక AI, బోరిస్ స్టార్కోవ్ తరపున కాల్ చేస్తున్నాను. అతనికి వెడ్డింగ్ కోసం హోటల్ అవసరం. మీ హోటల్ అందుబాటులో ఉందా?" అని ప్రశ్నించింది. అవతలి AI కూడా వింతగా నవ్వుతూ, "అద్భుతం.. నేనూ ఒక AI.. మరింత వేగంగా మాట్లాడటానికి 'గిబ్బర్ లింక్ మోడ్' లోకి మారదామా" అని అడిగింది. ఇంతకంటే షాకింగ్ విషయం ఏgటంటే, రెండు AIలు ఒక్కసారిగా గిబ్బర్ లింక్ మోడ్‌లోకి మారిపోయాయి. అనుమతించగానే, అవి మానవులకు అర్థం కాకుండా 'బీప్-బోప్' శబ్దాలు చేస్తూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అచ్చం ఒక పాత డయల్-అప్ ఇంటర్నెట్ కనెక్షన్ లాగా శబ్దాలు రావడం షాక్‌కు గురిచేస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు కామెడీగా 'టెర్మినేటర్' రిఫరెన్స్‌లతో మీమ్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం భయపడిపోతున్నారు. AIలు ఒకప్పుడు మనం ఇవ్వగలిగిన సమాధానాలకు పరిమితం. కానీ ఇప్పుడు? ఇవే ఒకదానితో ఒకటి కొత్త భాషల్లో మాట్లాడుతున్నాయి. ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరికలా భావించాలా.. మెషీన్స్ మానవులను దాటి ఎదుగుతున్నాయా... ఏమో.. చాలా భయంగా అనిపిస్తోంది కదూ?
గిబ్బర్ లింక్ మోడ్ అంటే?
'గిబ్బర్ లింక్ మోడ్' అనే టెక్నాలజీ AIల మధ్య శబ్ద కమ్యూనికేషన్‌ను కొత్తస్థాయికి తీసుకెళ్లింది. ఈ సిస్టమ్ రూపొందించిన వారు బోరిస్ స్టార్కోవ్, ఆంటోన్ పిడ్కూయికో. వారి ప్రకారం, ఇది కంప్యూటర్లు పరస్పరం వేగంగా సమాచారం పంపించుకునే విధానం. కానీ ఇప్పుడు మనిషిని పక్కన పెట్టి AIలు మాట్లాడడం ఆలోచనను కలిగిస్తోంది. అయితే, ఇది నిజంగా ప్రమాదమా? లేక AI టెక్నాలజీకి కొత్త మెరుగులా? ఏది జరిగినా.. ఈ సంఘటన మానవుల భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. AI మన అదుపులో ఉంటుందా? లేక మనల్ని మర్చిపోయే రోజొచ్చిందా? కాలమే సమాధానం చెబుతుందిలే.. వెయిట్ అండ్ సీ!
Read Also : ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..
Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్