iPhone Security Alert: ఐఫోన్ వాడుతున్నారా.. సైబర్ ఎటాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఇలా చేయండి..
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:02 PM
రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతుండడంతో.. వాటి నుంచి ఐఫోన్లను రక్షణ కల్పించే దిశగా ఆపిల్ కంపెనీ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. iOS 18.4.1 పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది..

ఐఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా చూస్తుంటాం. చేతిలో ఐఫోన ఉందంటే ఆ కిక్కే వేరు. అందుకు ప్రతి ఒక్కరికీ ఐఫోన్ అనేది ఓ డ్రీమ్. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యాపిల్ కంపెనీ వారు కూడా ఈ ఫోన్లను అనేక భద్రతా ప్రమాణాలతో తయారు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు తమ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పంపిస్తూ అప్రమత్తం చేస్తుంటుంది. ఈ క్రమంలో భాగంగా తాజాగా, ఆపిల్ కంపెనీ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. సైబర్ దాడులకు గురి కాకుండా ఉండేందుకు వెంటనే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది.
రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతుండడంతో.. వాటి నుంచి ఐఫోన్లను రక్షణ కల్పించే దిశగా ఆపిల్ కంపెనీ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. iOS 18.4.1 పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ఐఫోన్ వినియోదారులు వెంటనే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ సూచిస్తోంది.
ఈ ఫీచర్ ఇలా పని చేస్తుంది..
iOS 18.4.1: CoreAudio, RPAC లలో కీలకమైన భద్రతా లోపాలను పరిష్కరిస్తుంది. అధునాతన సైబర్ దాడుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
iPadOS 18.4.1: పరికరాన్ని రక్షించడానికి అవసరమైన భద్రతా ప్రమాణాలను సరి చేస్తుంది.
macOS Sequoia 15.4.1: Mac పరికరాలను రక్షించడానికి అవసరమైన భద్రతా నవీకరణలను కలిగి ఉంటుంది.
tvOS 18.4.1, visionOS 2.4.1: Apple TV, Vision Pro పరికరాల కోసం భద్రతా ప్యాచ్‌లను అందిస్తుంది.
అప్‌డేట్ చేయడానికి ఇలా చేయండి..
1. ముందుగా సెట్టింగ్‌లోకి వెళ్లాలి.
2. జనరల్ నొక్కండి
3. సాఫ్ట్‌వేర్ నవీకరణను ఎంచుకోండి
4. నవీకరణను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించండి.