Share News

Elon Musks X Faces: చైల్డ్ పోర్నోగ్రఫీ కలకలం.. ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ పై తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:39 AM

ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. చైల్డ్ పోర్నోగ్రఫీ దుర్వినియోగానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. యూఎస్ సర్క్యూట్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది.

Elon Musks X Faces: చైల్డ్ పోర్నోగ్రఫీ కలకలం.. ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ పై తీవ్ర ఆరోపణలు
Elon Musks X Faces

టెస్లా వ్యవస్థాపకుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. చైల్డ్ పోర్నోగ్రఫీ దుర్వినియోగం కేసులో వార్తల్లో నిలిచారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించింది.

ఫేక్ అకౌంట్

ఈ సంఘటనలో ఇద్దరు మైనర్ పిల్లలు జాన్ డో 1, జాన్ డో 2 స్నాప్‌చాట్‌లో ఒక వ్యక్తి చేత మోసపోయారు. జాన్ డో 1 అప్పటికి 13 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. తన స్కూల్‌లోని 16 ఏళ్ల అమ్మాయి అని భావించిన ఓ వ్యక్తితో మాట్లాడాడు. ఈ ఫేక్ అకౌంట్ యూజర్ నమ్మించి, న్యూడ్ ఫోటోలు పంపించమని కోరింది. ఆ క్రమంలోనే అవి కాస్తా ఒక వీడియోగా Twitter/Xలో వెలుగులోకి వచ్చాయి. తరువాత ఇది ఒక చైల్డ్ పోర్నోగ్రఫీ ట్రాఫికర్ ద్వారా వచ్చాయని తేలింది.


ట్విట్టర్ ఏం చేసింది?

ఈ వీడియో గురించి తెలిసిన తర్వాత ట్విట్టర్ దాన్ని తొలగించడానికి, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC)కి రిపోర్ట్ చేయడానికి 9 రోజులు పట్టింది. దీంతో అప్పటికే ఆ వీడియోను ఏకంగా 1,67,000 సార్లు చూశారు. ఈ ఆలస్యం వల్ల ట్విట్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి.


కోర్టు ఏం చెప్పింది

9వ సర్క్యూట్ కోర్టు ఈ కేసులో కొన్ని ఆరోపణలను తిరస్కరించింది. X ప్లాట్‌ఫారమ్ కీలక ఆరోపణను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలల అశ్లీల చిత్రాలను NCMECకి తక్షణం రిపోర్ట్ చేయడంలో X నిర్లక్ష్యం వహించిందని కోర్టు తెలిపింది. సెక్షన్ 230 ప్రకారం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను యూజర్ కంటెంట్‌కు సంబంధించిన బాధ్యత నుంచి రక్షిస్తుంది.


తెలిసిన విషయాన్ని కూడా..

కానీ, ఈ కేసులో అశ్లీల కంటెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా X తగిన చర్యలను వెంటనే తీసుకోవడంలో విఫలమైందని కోర్టు చెప్పింది. అంటే, మీరు ఒక పబ్లిషర్‌గానే కాకుండా, మీకు తెలిసిన విషయాన్ని పట్టించుకోకుండా ఊరుకుంటే, మీకు రక్షణ ఉండదని కోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి కేసులు నివేదించడానికి X రిపోర్టింగ్ సిస్టం చాలా కష్టంగా ఉందని. దీనిపై కేసు కొనసాగుతుందని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 07:40 AM