Share News

AV Ranganath: నాలాల్లో ఆటంకాలు ఉండొద్దు..

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:20 AM

వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్‌, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు.

AV Ranganath: నాలాల్లో ఆటంకాలు ఉండొద్దు..

- బోరబండ హైటెన్షన్‌ రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టండి

- హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్‌, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు. పద్మావతినగర్‌ వద్ద నాలాను ఆక్రమించి ఇటీవల నిర్మించిన షెడ్లను తొలగించాలని స్థానికులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.


బోరబండ మీదుగా హైటెన్షన్‌ రోడ్డులో ఆక్రమణలను ఆయనకు చూపించారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ సూచించారు. అనంతరం బండ్లగూడ, జలపల్లి పరిసరాల్లోని పెద్దచెరువు, హుందాసాగర్‌ చెరువులను పరిశీలించారు. డ్రోన్‌ ఎగురవేసి మొత్తం చెరువు స్వరూపాన్ని చిత్రీకరించాలన్నారు.


city2.2.jpg

టీఎన్‌జీఓ కాలనీలో..

టీఎన్‌జీఓ కాలనీలోని మణికొండ జాగీర్‌ పరిధిలోకి వచ్చే ముసాయికుంట, గౌలిదొడ్డిలోని గౌసాయికుంటలను రంగనాథ్‌ పరిశీలించారు. చెరువుల పూర్తి విస్తీర్ణం, కబ్జాల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. వీటి పరిశీలన అనంతరం గోపన్‌సల్లి జర్నలిస్టు కాలనీలో అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు జోరుగు సాగుతున్నాయని బీసీ కమిషన్‌ నెంబర్‌ సురేందర్‌ హైడ్రా కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జర్నలిస్టు కాలనీకి కమిషనర్‌ వచ్చారు. అనంతరం మన్సూరాబాద్‌ డివిజన్‌ వివేకానందనగర్‌ కాలనీలో రోడ్డు కబ్జాపై ప్రధాన లేఅవుట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు తెలుసుకుని కబ్జాలపై తగు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2025 | 07:20 AM