Share News

August 2 Solar Eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం? పట్టపగలే భూమి చీకటిమయం..!

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:46 AM

ఆగస్టు 2, 2025న ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతోందా? ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

August 2 Solar Eclipse: ఆగస్టు 2న శతాబ్దంలోనే అరుదైన సూర్యగ్రహణం? పట్టపగలే భూమి చీకటిమయం..!
Will the world go dark on August 2

ఆగస్టు 2, 2025న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని.. భూమి మొత్తం 6 నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని సోషల్ మీడియాలో ఒక పుకారు వైరల్ అవుతోంది. 'గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్' అని పిలిచే ఈ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం ఖగోళ ప్రియులు(స్కై గేజర్స్) ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరో పక్క ఈ సూర్యగ్రహణం అత్యంత ప్రమాదకరమైందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ, ఆగస్టు 2న ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతోందా? ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?


ఆగస్టు 2న భూమి చీకటిమయం అవుతుందా?

ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆగస్టు 2, 2025న సూర్యగ్రహణం ఉండదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం. ఈ విషయాన్ని నాసా సహా అనేక ఖగోళ సంస్థలు ఇప్పటికే నిర్ధారించాయి. నిజమేంటంటే, అందరూ మాట్లాడుకుంటున్న సూర్యగ్రహణం రెండు సంవత్సరాల తరువాత, ఆగస్టు 2, 2027న వస్తుంది.100 సంవత్సరాల తర్వాత వచ్చే అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. ఎందుకంటే ఆ రోజున చంద్రుడు సూర్యుడిని దాదాపు 6 నిమిషాల 23 సెకన్ల పాటు పూర్తిగా కప్పేస్తాడు. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో పట్టపగలే చీకటి ఆవరిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజున సంభవిస్తుంది, ఎందుకంటే అప్పుడే చంద్రుడు, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తాయి. కానీ, ఆగస్టు 2, 2025 న అమావాస్య లేదు. కాబట్టి ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడటం సాధ్యం కాదు.


ఈ గ్రహణం ప్రధానంగా యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. మొరాకో, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోనూ మధ్యాహ్న సమయంలోనే సూర్యుడు పూర్తిగా కప్పివేయబడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆ ప్రాంతాలు పూర్తి చీకటిలో మునిగిపోవచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో పాక్షిక గ్రహణం మాత్రమే

ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు. అయితే, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం నమోదు కానుంది. TimeandDate.com ప్రకారం, భారత్‌లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గ్రహణం ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది.


అంతరిక్ష పరిశోధనలకు కీలక ఘడియలు

సంపూర్ణ సూర్యగ్రహణాలు ఖగోళ పరిశోధనలకు అత్యంత అనుకూలం. సూర్యుడి కిరణాలు తగ్గిపోయే ఈ సమయంలో కాస్మిక్‌ ఎనర్జీని అధ్యయనం చేయడం పరిశోధకులకు మరింత సులభమవుతుంది. గ్రహణ సమయంలో సూర్యుడు పూర్తిగా చంద్రుడు ఛాయలోకి మారిపోతాడు. ప్రజలు పట్టపగలే ప్రత్యక్షంగా సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. సంపూర్ణ అంధకారాన్ని అనుభవిస్తారు. Space.com తెలిపిన సమాచారం ప్రకారం, ఇంత సుదీర్ఘ కాలవ్యవధి కలిగిన సూర్యగ్రహణం మళ్లీ 2114లోనే సంభవిస్తుంది.


ఇవి కూడా చదవండి:

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

యూపీఐ యాప్స్ వాడతారా.. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

Read Latest and Technology News

Updated Date - Jul 30 , 2025 | 01:09 PM