Share News

BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:53 AM

Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్
Liquor scam

AP Liquor Scam: ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) అదుపులోకి తీసుకున్నారు. A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajashekar Reddy) కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ (Varun) కీలక వ్యక్తిగా గుర్తించారు.

అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


రూ.11 కోట్లు స్వాధీనం...

లిక్కర్ స్కాంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు (బుధవారం జులై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Updated Date - Jul 30 , 2025 | 10:06 AM