Cyber security Alert: ప్రభుత్వం హెచ్చరిక..ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని సూచన..
ABN , Publish Date - Jul 20 , 2025 | 08:19 PM
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.

రోజురోజుకూ ఓ వైపు డిజిటల్ వినియోగం పుంజుకుంటున్న నేపథ్యంలో మరోవైపు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు సామాన్య ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను (Cyber security Alert) ఉపయోగిస్తున్నారు. కొంత మందికి వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ నేరాలకు బలవుతున్నారు. కొందరు తెలియకుండానే వారి ఫోన్‌లను నేరస్తులకు అనుమతి ఇస్తున్నారు.
దీనివల్ల వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు జారీ చేసింది. దీంతోపాటు కొన్ని యాప్‌లను మీ ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.
ఈ యాప్‌లను ఉపయోగించవద్దు
ప్రభుత్వం సైబర్ నేరాల గురించి హెచ్చరిస్తూ, స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని కోరింది. దీంతోపాటు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన వాటిని వెంటనే డిలీట్ చేయాలని తెలిపింది. ఈ యాప్‌లు మీ ఫోన్ స్క్రీన్‌ను నేరస్తులకు చూపిస్తాయని, దీనివల్ల వారు మీ ఓటీపీలు, సందేశాలు, బ్యాంకు వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని చూసే ఛాన్సుందని వల్లడించింది. ఈ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయవచ్చు. కాబట్టి, ఈ రకమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించడం పూర్తిగా మానేయాలని సూచించారు.
అనుమతులు ఇస్తున్నప్పుడు జాగ్రత్త
కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది కొన్ని అనుమతులు అడుగుతుంది. చాలా మంది వాటిని చదవకుండా అన్నింటికీ అనుమతించు అని ఒప్పుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లు మీ ఫోన్‌లోని అన్ని కార్యకలాపాలను నేరస్తులకు చూపిస్తాయని ప్రస్తావించారు. ఉదాహరణకు, మీరు బ్యాంకు లావాదేవీలు చేస్తున్నప్పుడు వచ్చే ఓటీపీలను వారు చూసే అవకాశం ఉంది. అందుకే యాప్‌లకు అనుమతులు ఇచ్చే ముందు జాగ్రత్తగా చూసి పర్మిషన్ ఇవ్వాలన్నారు.
గోప్యతా సెట్టింగ్‌లు
సైబర్ నేరాలను నివారించడానికి సోషల్ మీడియా సీక్రెట్ సెట్టింగ్‌లు కూడా చాలా ముఖ్యమని గుర్తు చేశారు. ఈ క్రమంలో మీ సోషల్ మీడియా ఖాతాలలో సెట్టింగ్‌లను సరిచేసుకోవాలన్నారు. మీ వ్యక్తిగత సమాచారం అందరికీ కనిపించకుండా చూసుకోవాలన్నారు. ఉదాహరణకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఫోటోలు వంటివి అందరికీ బహిర్గతం కాకుండా పరిమితం చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్తులు మీ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని గుర్తు చేశారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
స్క్రీన్ షేరింగ్ యాప్‌లను తొలగించండి: ఇప్పటికే ఇలాంటి యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి
అనుమతులను జాగ్రత్తగా చూడండి: కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అడిగే అనుమతులను జాగ్రత్తగా చదవండి
సోషల్ మీడియా గోప్యత: మీ సోషల్ మీడియా ఖాతాలలో గోప్యతా సెట్టింగ్‌లు సరిగ్గా ఉన్నాయో చెక్ చేయండి
అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు: తెలియని లింక్‌లు లేదా మెసేజులను క్లిక్ చేయకండి
మీ ఫోన్‌ను అప్‌డేట్ చేయండి: మీ స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి
ఇవి కూడా చదవండి
వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి