WPL 2026 Schedule Update: మహిళల ప్రీమియర్ లీగ్ కు సంబంధించి బిగ్ అప్‌డేట్
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:22 PM
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఎల్ కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం.
ఇటీవల ఉమెన్ ప్రీమియర్ లీగ్‌కు క్రేజ్ బాగా పెరిగింది. గత ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. మరోవైపు డబ్ల్యూపీఎల్(WPL 2026 schedule) సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళ ఐపీఎల్ 2026కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం. వేదికలుగా ముంబై, బరోడా నగరాలు ఖరారైనట్లు తెలుస్తోంది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం( Mumbai DY Patil Stadium WPL)లో జరగనున్నాయని టాక్. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ఈ స్టేడియం, భారత మహిళా క్రికెటర్లకు కలిసొచ్చిన మైదానంగా పేరుగాంచింది. బరోడాలోని కోటంబి స్టేడియంలో రెండో అర్ద భాగం మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. పై సమాచారంపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే వేలం సమయంలో ప్రకటించే అవకాశం ఉంది.
వేదికల కోసం లక్నో, బెంగళూరు నగరాలు కూడా పోటీపడినప్పటికీ, ముంబై, బరోడా( Baroda Kotambi Stadium)కే అవకాశం దక్కిందని సమాచారం. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో జరిగాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగాయి. గత ఎడిషన్ మ్యాచ్‌లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగ్గా, ఈసారి జనవరి నుంచి జరపాలని ప్రయత్నం జరుగుతోంది. ఫిబ్రవరి తొలి వారంలో పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 ప్రారభం కానుంది. ఈ కారణంగాతోనే జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి