Share News

Ruturaj Gaikwad Creates Record: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:42 PM

భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్-ఏ క్రికెట్ లో అరుదైన రికార్డును సృష్టించాడు. సౌతాఫ్రికా-ఏ జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

Ruturaj Gaikwad Creates Record: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు
Ruturaj Gaikwad

టీమిండియా యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్(IPL) లో అదరగొట్టిన అతడు, జాతీయ, అంతర్జాతీయ మ్యాచుల్లోనూ సత్తాచాటుతున్నాడు. పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంటున్నాడు. తాజాగా మరో సరికొత్త రికార్డును రుతు‌రాజ్ (Ruturaj Gaikwad) సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్‌, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన టీమిండియా ప్లేయర్ గా అతడు అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.


రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో వన్డేలో గైక్వాడ్ అజేయ అర్ధసెంచరీ ( 68 నాటౌట్‌) సాధించాడు. దీంతో రుతురాజ్‌ లిస్ట్‌-ఏ సగటు 57.80కి చేరింది. ఈ సగటుతో చతేశ్వర్‌ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్‌-ఏ క్రికెట్‌(List A Cricket Records)లో అత్యధిక సగటు కలిగిన టీమిండియా ప్లేయర్ గా గైక్వాడ్ అవతరించాడు. అలానే ఓవరాల్ గా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన ప్లేయర్ల జాబితాలో రుతురాజ్‌ కంటే ముందు కేవలం ఒక ఆటగాడు మాత్రమే ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్‌ బాల్‌ దిగ్గజం మైఖేల్‌ బెవాన్‌(Michael Bevan) (57.86) రుతురాజ్‌ కంటే ముందున్నాడు. ఇప్పటివరకూ రుతురాజ్ కెరీర్‌లో 85 లిస్ట్‌-ఏ ఇన్నింగ్స్‌లు ఆడగా.. 17 శతకాలు, 18 అర్ధ శతకాల సాయంతో 4,509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోర్‌ 220*గా ఉంది.


లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన టాప్‌-5 ప్లేయర్లు:

  1. మైఖేల్‌ బెవాన్‌-57.86 (427 ఇన్నింగ్స్‌లు)

  2. రుతురాజ్‌ గైక్వాడ్‌-57.80 (85 ఇన్నింగ్స్‌లు)

  3. సామ్‌ హెయిన్‌-57.76 (64 ఇన్నింగ్స్‌లు)

  4. చతేశ్వర్‌ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్‌లు)

  5. విరాట్‌ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్‌లు)



ఇవి కూడా చదవండి:

Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా

ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 05:13 PM