Share News

Haryana Shocker: 22వ అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో..

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:24 PM

గురుగ్రామ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల చిన్నారి ఒకరు 22వ అంతస్తులోని ఫ్లాట్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి కన్నుమూశాడు.

Haryana Shocker: 22వ అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో..
Gurugram Child Dies After Falling From 22nd Floor

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని గురుగ్రామ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడు 22వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి కింద పడి దుర్మరణం చెందాడు. ఫ్లాట్ తలుపులు మూసుకుపోవడంతో భయపడ్డ బాలుడు బాల్కనీ ఎక్కి సాయం అర్థించే క్రమంలో పట్టుతప్పి కిందపడి మరణించాడు (Child dies after fall from 22 floor).

గురుగ్రామ్‌లోని సెక్టర్ 62లోగల పయనీర్ ప్రిసీడియా హౌసింగ్ సొసైటీ అపార్ట్‌మెంట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పని మనిషితో కలిసి బాలుడు తన ఫ్లాట్‌‌కు వెళ్లాడు. తాము ఉంటున్న అంతస్తుకు చేరుకోగానే బాలుడు లిఫ్ట్‌లోంచి బయటకు పరిగెత్తి తన ఫ్లాట్‌లోకి వెళ్లిపోయాడు. పనిమనిషి కూడా బాలుడి వెంట లోపలికి వెళ్లే లోపే ప్రధాన ద్వారం తలుపులు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కారణంగా మూసుకుపోయాయి. దీంతో, ఒంటరిగా మారిన బాలుడు బెదిరిపోయి బాల్కనీలోకి వెళ్లాడు. అక్కడ దుస్తులు ఆరేసుకునే రాడ్స్ పట్టుకుని పైకెక్కి సాయం కోసం అరిచే ప్రయత్నంలో పట్టుతప్పడంతో కింద పడి దుర్మరణం చెందాడు (Gurugram Tragic incident).


బాలుడి తండ్రి ప్రకాశ్ చంద్ర ఓ బిల్డర్. అతడి తల్లి వైద్యురాలు. వారు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రులకు చిన్నారి ఒక్కడే సంతానం కావడంతో వారు శోకసంద్రంలో కూరుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు.


ఇవీ చదవండి:

ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు 10 రోజుల పాటు అద్దె ఇంట్లో నిందితుడి మకాం

బిహార్ ఎన్నికల కోసం రూ.14,000 కోట్లు మళ్లించిన కేంద్రం.. జన్‌సురాజ్ సంచలన ఆరోపణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 04:31 PM