Saad Masood Overaction: భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్ ప్లేయర్ ఓవరాక్షన్
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:49 PM
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా ఆదివారం దోహా వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో పాక్ ప్లేయర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ చేశాడు.
'కుక్క తోక వంకర' అనే సామెత అందరికీ సుపరిచితమే. ఈ మాట కొందరికి బాగా సరిపోతుంది. ముఖ్యంగా క్రికెట్‌లో పాకిస్థాన్(Pakistan) ఆటగాళ్లకు బాగా సెట్ అవుతుంది. వారికి ఎన్ని షాకులు తగిలినా వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ఆసియా కప్-2025లో వరుసగా మూడు మ్యాచుల్లో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓడింది. ఆ టోర్నీలో భారత్ తో జరిగిన మ్యాచుల్లో రవూఫ్ లాంటి పాక్ ప్లేయర్లు ఫీల్డింగ్ సమయంలో బాగా ఓవరాక్షన్ చేశారు. వారికి బ్యాట్‌తో మన ప్లేయర్లు బుద్ధి చెప్పడమే కాకుండా.. పాక్ ను చిత్తుగా ఓడించి.. ఆసియా కప్ ను సొంతం చేసుకున్నారు. ఇంత అవమానం జరిగినా పాక్ ప్లేయర్ల బుద్ధి మారడం లేదు. మ్యాచుల్లో ఏదైనా విజయం సాధిస్తే సంబరమనేది పరిధిలో చేసుకోవాలి.. కానీ పాక్ ప్లేయర్లు శృతిమించి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్(Asia Cup Rising Stars 2025) భారత్, పాక్ మ్యాచ్ లో పాక్ ప్లేయర్ ఓవరాక్షన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్(Asia Cup Rising Stars 2025)లో భాగంగా ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (75) పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ లో విజయమనేది ఎవరినో ఒకరిని వరించాలి. అది సహజం. కానీ, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ స్పిన్నర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ (Saad Masood Overaction) చేశాడు.
ఈ మ్యాచ్ లో ఇండియా-ఏ వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ నమన్ ధీర్ మంచి ఫామ్ లో కనిపించాడు. దీంతో అతడిని ఎలాగైనా ఔట్ చేయాలని పాక్ కెప్టెన్.. సాద్ మసూద్(Saad Masood Overaction)ను ఎటాక్‌లో తీసుకొచ్చాడు. దీంతో మసూద్ వేసిన 8వ ఓవర్ బౌలింగ్‌లో నమన్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ సమయంలో మసూద్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. ధీర్ వైపు చూస్తూ ఇక ఆడింది చాలు అన్నట్లు సీరియస్‌గా చేతితో సైగలు చేశాడు. నమన్(Naman Dhir) మాత్రం అతడితో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా సైలెంట్ గా గ్రౌండ్ ను వదిలి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ ప్లేయర్ల తీరు అంతేనని కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా మసూద్‌కు భారత్ ప్లేయర్లు రిటర్న్ గిప్ట్ ఇచ్చేస్తారని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి