Share News

LPG Imports from US: అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతి.. అందుబాటు ధరలో వంటగ్యాస్‌.!

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:34 PM

భారత్‌లో వంటగ్యాస్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతి కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో మార్గం సుగమం కానుంది.

LPG Imports from US: అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతి.. అందుబాటు ధరలో వంటగ్యాస్‌.!
LPG imports from US

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇంధన భద్రతను బలోపేతం దిశగా కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకోసం అమెరికా నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(LPG) దిగుమతి చేసుకోవడానికి గానూ.. భారత్ మొదటి నిర్మాణాత్మక, దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందం గురించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ(Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri) ప్రకటించారు.


ఈ ఒప్పందంలో భాగంగా 2026 ఏడాదికి యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి 2.2 మిలియన్ టన్నుల(MTPA) ఎల్‌పీజీని దిగుమతి చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. ఇది దేశంలోని వార్షిక దిగుమతుల్లో సుమారు 10 శాతానికి సమానం. దీనివల్ల దేశ ప్రజలకు అందుబాటు ధరకే ఎల్‌పీజీ అందించేందుకు మార్గం సుగమం కానుందని ఆయన అన్నారు. ఈ విషయమై కొన్ని నెలలుగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC), భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) కంపెనీలకు చెందిన అధికారుల సంయుక్త బృందం.. అమెరికా ఉత్పత్తిదారులతో చర్చలు జరిపినట్టు పురీ వెల్లడించారు.


ఇవీ చదవండి:

Northern Lights: మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?

Maithili Thakur: బీహార్ ఎన్నికలు.. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి మైథిలీ ఠాకూర్

Updated Date - Nov 17 , 2025 | 04:12 PM