Temba Bavuma Comments: అదే మా విజయానికి టర్నింగ్ పాయింట్: బవుమా
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:26 PM
కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇక తమ విజయానికి కారణం ఏంటనేది సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు.
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ ను భారత్ ఓటమి(South Africa vs India Test)తో ఆరంభించింది. తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ప్రొటీస్ జట్టు చేతిలో ఓడింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్ పై అద్భుత విజయం సాధించిన అనంతరం సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma comments) స్పందించాడు. భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ గెలుపులో తమ బౌలర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మీడియాతో మాట్లాడుతూ.. ' ఇవాళ(తొలి టెస్టు మూడో రోజు) కార్బిన్ బోష్‌తో తాను నెలకొల్పిన భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. ఈ మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరిన్ని మ్యాచులు ఆడి.. ఫలితం మావైపు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టమనిపించింది. అయితే మా బౌలర్లు(South Africa bowlers) అద్భుత ప్రదర్శనతో ఆటను మావైపుకు తీసుకువచ్చారు. తరుచుగా బౌలర్లను మార్చడం మాకు కలిసొచ్చింది. మా బౌలర్లు బంతిని అందించినప్పుడల్లా వికెట్లు తీసి.. మ్యాచ్ ను మా వైపు తిప్పుకొచ్చారు. ఈ ఉదయం కార్బిన్ బోష్‌తో నేను నమోదు చేసిన భాగస్వామ్యం మా గెలుపుకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
ఇక నా కెప్టెన్సీ గురించి మాట్లాడాలంటే జట్టులోని ఆటగాళ్లు రాణిస్తేనే కెప్టెన్ సక్సెస్ అవుతాడు. కాబట్టి నా కెప్టెన్సీ(Temba Bavuma captaincy)క్రెడిట్ మా ఆటగాళ్లకే ఇస్తాను. నా టెక్నిక్‌తో బ్యాటింగ్ లో సౌకర్యంగా ఉన్నాను. మంచి ప్రదర్శన చేయాలనే బలమైన కోరికతో భారత్ కు వచ్చాను. ఇండియాలో నాకు మెరుగైన రికార్డ్ లేదు. దాన్ని మెరుగుపర్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. తొలి ఇన్నింగ్స్‌లో నా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాను. రెండో ఇన్నింగ్స్‌లోనూ మా బ్యాటింగ్‌ను పెద్దగా మార్చలేదు. నేను కూడా కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాను. అదృష్టం కూడా కలిసొచ్చింది. రబడా లేకున్నా.. కేశవ్, సైమన్ అదరగొట్టారు. ఈ ఇద్దరితో మా బౌలింగ్ విభాగం బలంగా మారింది'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి