Sabarimala Piligrims: అయ్యప్ప భక్తులకు ముఖ్య సూచన
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:38 PM
హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: స్వామియే శరణం అయ్యప్ప.. కార్తీక మాసం మొదలు.. మకర సంక్రాంతి వరకు ఎక్కువగా వినిపించే శరణు ఘోష. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల ధారణ చేసి.. 41 రోజులు పాటు నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారు. ప్రతి ఏటా మండలపూజా మహోత్సవం, మకరవిళక్కు సమయంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి కేరళలోని శబరిగిరీశుడిని దర్శించుకుంటారు. మండలపూజా మహోత్సవంలో భాగంగా నవంబర్ 16వ తేదీ నుంచి శబరిమలలోని అయ్యప్పస్వామి గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు నుంచి అయ్యప్ప స్వామి తన భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇక ఇప్పటికే అయ్యప్ప మాల వేసిన లక్షలాది మంది భక్తులు.. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్తున్నారు.
ఈసారి శబరిమలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉండటంతో.. కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పలు సూచనలు చేసింది. 'బ్రెయిన్ ఫీవర్' పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. కేరళలో ఇటీవల ప్రమాదకరమైన ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (PAM) వ్యాధి - దీనిని 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' ఫీవర్ అని.. మెదడు వాపు వ్యాధి అని పిలుస్తుంటారు. దీని బారిన పడకుండా పలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
భక్తులు శబరిమల సన్నిదానంలోని నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరింది. నీటిలో Naegleria fowleri అనే అమీబా ఉండే అవకాశం ఉందని, ఇది ముక్కు ద్వారా మెదడుకు చేరి ప్రమాదకర స్థితిని తీసుకురావొచ్చని పేర్కొంది.
దీనికి సంబంధించి కేరళ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ విజయ్‌కుమార్ పురుషోత్తం పలు సూచనలు చేశారు. భక్తులు స్నానం చేసేటప్పుడు నదులు, సెలయేర్ల నీరు ముక్కు ద్వారా లోనికి పోకుండా చూసుకోవాలన్నారు. తలనొప్పి, జ్వరం, వాంతులు, మూర్ఛలు వంటి సూచనలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలని కోరారు. త్వరితగతిన డయాగ్నసిస్ లేకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..
KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్.. రేపు విచారణ