Share News

Surya Kumar Skips Ranji Trophy: సూర్యకుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Nov 13 , 2025 | 07:49 PM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంజీ ట్రోఫీ 2025లో తదుపరి మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Surya Kumar Skips Ranji Trophy: సూర్యకుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం
Suryakumar Yadav

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీప్‌కు సన్నద‌మ‌య్యేందుకు రంజీ క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండాల‌ని భావించాడు. సూర్య బాటలోనే శివం దూబే(Shivam Dube) కూడా వెళ్తున్నా్న్నారు. ఈ స్టార్ క్రికెట‌ర్లు ఇప్పటికే త‌మ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశారు. వారిద్దిరి స్ధానంలో తనుష్ కొటియన్, మోహిత్ అవస్థిలను సెలెక్టర్లు జ‌ట్టులోకి తీసుకున్నట్లు సమచారం.


రంజీ ట్రోఫీ 2025-26( Ranji Trophy ) త‌దుప‌రి రౌండ్ మ్యాచ్‌ల నుంచి సూర్యకుమార్ యాద‌వ్‌, ఆల్‌రౌండ‌ర్ శివమ్ దూబే(Shivam Dube) త‌ప్పుకొన్నారు. వాస్తవానికి న‌వంబ‌ర్ 16 నుంచి శ‌ర‌ద్ ప‌వార్ అకాడ‌మీ వేదిక‌గా పాండిచ్చేరితో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున సూర్య కుమార్, శివం దూబే ఆడాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఏడాది ఆఖ‌రిలో జ‌ర‌గ‌నున్న దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం సూర్య కుమార్ ఆడ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(Mumbai Cricket Team) అధికారి ఒక‌రు ధ్రువీక‌రించారు.


స‌య్యద్ ముస్తాక్ అలీ టోర్నీని(Syed Mushtaq Ali Trophy) టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026 స‌న్నాహాకంగా ఉప‌యోగించుకోవాల‌ని సూర్య భావిస్తున్నడంట‌. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో సూర్య కుమార్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గత ఐపీఎల్‌లో మెరుగైన ప్రద‌ర్శన చేసిన‌ప్పటికి ఆ త‌ర్వాత ఆసియాక‌ప్‌, ఆస్ట్రేలియా టూర్ లో నిరాశప‌రిచాడు. ఆస్ట్రేలియా(Australia) సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత్ లో దక్షిణాఫ్రికా(South Africa)తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌లో త‌న ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకోవాల‌ని సూర్య భావిస్తున్నాడు. ప్రోటీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

భద్రతా సమస్యలు.. పాక్ నుంచి తిరిగెళ్లిపోనున్న శ్రీలంక క్రికెటర్లు

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 07:49 PM