Sanju Samson: కేసీఏ కీలక ప్రకటన.. కెప్టెన్‌గా సంజూ శాంసన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:54 AM
టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కేరళ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026కి కేరళ తమ జట్టును ప్రకటించింది.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ కేరళ జట్టుకు కెప్టెన్(Sanju Samson Kerala captain)గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) వెల్లడించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 కోసం కేసీఏ తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకోవాలని శాంసన్ భావిస్తున్నాడు. అయితే ఈ టోర్నీ మొత్తానికి సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. అతడు కేవలం గ్రూపు స్టేజిలో మాత్రమే ఆడనున్నాడు.
నవంబర్ 26 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ( Syed Mushtaq Ali Trophy 2025) ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ టోర్నీ లీగ్ గ్రూపు దశ మ్యాచ్‌లు డిసెంబర్ 8తో ముగుస్తాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆడే జట్టులో సంజూ చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సంజూ స్థానంలో కేరళ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ ఇమ్రాన్ వ్యవహరించనున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 26న లక్నో వేదికగా యూపీతో తలపడనుంది. కేరళ జట్టులో రోహన్ ఎస్ కున్నుమ్మల్, మహ్మద్ అజరుద్దీన్ వంటి విధ్వంసకర ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్-2026 సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా సంజూ(IPL 2026 CSK captain) వ్యవహరించను సంగతి తెలిసిందే.
కేరళ జట్టు:
సంజూ శాంసన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, మహ్మద్ అజారుద్దీన్, అహమ్మద్ ఇమ్రాన్ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, నిధీష్, ఆసిఫ్, అఖిల్ స్కారియా, బిజు నారాయణన్ ఎన్, అంకిత్ శర్మ, కృష్ణ దేవన్, అబ్దుల్ బాజిత్ పిఎ, షరఫుద్దీన్ ఎన్‌ఎమ్, సిబిన్ వి, ప్రసాద్, సల్మాన్ నిజార్
ఇవి కూడా చదవండి
NZ VS WI: అదరగొట్టిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ కైవసం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..